- గజ్వేల్ నుంచి కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు
- డిసెంబర్ 10 నుంచి పాదయాత్ర
హైదరాబాద్ (డిసెంబర్ – 01) : సీఎం కేసీఆర్ ఉద్యమ హామీ అయిన కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ కొప్పిశెట్టి సురేష్ నేతృత్వంలోని కాంట్రాక్టు లెక్చరర్ల డిసెంబర్ 10 నుండి గజ్వేల్ నియోజకవర్గం కేంద్రం నుండి కోనాయిపల్లె వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు 475 సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి. రమణారెడ్డి, డా. కొప్పిశెట్టి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంటర్మీడియట్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న దాదాపు 5000 మంది కాంట్రాక్టు జూనియర్, పాలిటెక్నిక్ మరియు డిగ్రీ లెక్చరర్ల క్రమబద్దీకరణ ప్రక్రియను త్వరగా పూర్తి కావడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టదైవమైన కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు పొందడానికి పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే క్రమబద్ధీకరణకు సంబంధించిన ప్రక్రియ పూర్తయి జీవోలు విడుదల ఆలస్యం అవ్వడం పట్ల కాంట్రాక్ట్ లెక్చరర్లు మనోవేదనకు గురవుతున్నారని… అనేకమంది రిటైర్మెంట్ కు దగ్గర ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ పాదయాత్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు అని ప్రభుత్వ దృష్టికి తమ క్రమబద్ధీకరణ సమస్యను తీసుకెళ్లడమే ధ్యేయంగా ఈ పాదయాత్రను చేపట్టినట్లు డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.
కావున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు లెక్చరర్లు భారీ ఎత్తున పాదయాత్రలో పాల్గొని మన సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్ళేందుకు కృషి చేయాలని కొప్పిశెట్టి సురేష్ పిలుపునిచ్చారు.
Follow Us @