బదిలీలకై పాదయాత్ర చేసిన సీజేఎల్స్ కట్ చేసిన వేతనాలను తిరిగి చెల్లించండి.

ప్రజాసామ్య బద్దంగ,న్యాయంగా బదిలీల కొరకు GCLA475 సంఘము చేసినా బదిలీల కోసం యాదగిరిగుట్ట నుండి హైదరాబాద్ వరకు “బదిలీల సాదన సంకల్ప పాదయాత్ర” లొ పాల్గొన్న కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులకు 2 రొజుల వేతనము కట్ చేసిన విషయము తెలిసిందే.

ఇంటర్విద్యా కమిషనర్ కు సంఘము తరపున ఈ విషయం పై CL ఉన్నవారికీ అవైల్ చేయలని , ఆదివారము వేతనము కట్ చెయవద్దు అని వినతి పత్రము ఇవ్వడము జరిగింది.

ఈ నేపథ్యంలో 475 సంఘం వినతిని పరిశీలించిన కమిషనర్ CL ఉన్నవారికీ claim చేయలని, ఆదివారము వేతనము claim చేయాలని సంబందిత అదికారులకు అదేశాలు ఇస్తూ ప్రొసిడింగ్ విడుదల చేశారు

ఈ సందర్భంగా 475 సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ మాట్లాడుతూ ఇందుకు సహకరించిన కమీషనర్ కి, ఇంటర్ విద్య అదికారులకు, MLC నర్శిరెడ్డికి, TIGLA సంఘ నాయకులకు పాదయాత్రికుల తరపున దన్యవాదములు తెలియజేశారు.

Follow Us@