మృతి చెందిన కాంట్రాక్టు లెక్చరర్ భార్యకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం.

డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ దశరత్ ఆకస్మిక మరణం చెందడంతో వారి భార్య శ్రీలతకి మానవతా దృక్పథంతో ఆఫీస్ సబార్డినెట్ గా ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగం కల్పిస్తూ కళాశాల కాలేజియేట్ కమిషనర్ నవిన్ మిట్టల్ ఈ రోజు ఉత్తర్వులు ఇచ్చారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, కమిషనర్ నవిన్ మిట్టల్ లకు డిగ్రీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ కుమార్ మరియు మహిళా నాయకులు అరుణ కుమారి, సుధారాణి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Follow Us @