29 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగింపు

హైదరాబాద్ (జూలై – 05) : తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారుల (డీఐఈఓ) కార్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న 29 మంది సిబ్బందిని తొలగిస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ (Out sourcing jobs) మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సర్వీస్ నుండి తొలగించిన వారిలో 11 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 15 మంది ఆఫీస్ సబార్డినేట్లు, ముగ్గురు నైట్ వాచ్ మెన్ లు ఉన్నారు.