ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మినారాయణను సన్మానించిన మబ్బు కరుణాకర్ బృందం

జనగాం జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రంలోని సిరిపురం గ్రామ వాస్తవ్యులు ప్రొ॥ పప్పుల లక్ష్మినారాయణ గారు ప్రతిష్టాత్మక వందేళ్ళ చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి రిజిస్ట్రార్ గా నియమితులు కావడం పట్ల జిల్లా వాసులు, గ్రామ ప్రజలు మరియు విద్యావంతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఒక మారుమూల ప్రాంతం నుండి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోని ఉన్నత స్థానంలో చేరుకోవడం చాలా ఆనందంగా ఉందని మన జిల్లావాసి కావడం గర్వంగా ఉందని, అలానే ఉప కులపతి రవీందర్ సార్ కూడా మన జనగామ జిల్లా వడ్లకొండ వాసి కావడం చాలా సంతోషంగా ఉందని కళ్ళెం గ్రామానికి చెందిన TRSV రాష్ట్ర నాయకులు, స్టేషన్ ఘణపుర్(SC) అధికార ప్రతినిధి మబ్బు కరుణాకర్(P.hD, OU) అన్నారు. ఈ సందర్బంగా లక్ష్మి నారాయణ, రవీందర్ లను ఉస్మానియా యూనివర్సిటీలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు.

Follow Us@