ఉస్మానియా పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్షా ఫీజుల స్వీకరణ

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరిస్తున్న‌ట్లు ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

MA, MCom, MSc, MSW, MCom (IS), MLISC, MCJ, ఐదేళ్ల ఇంటిగ్రేడెట్‌ ఎమ్మెస్సీ కెమిస్ట్రీ మొదటి సెమిస్టర్‌ పరీక్షా ఫీజును వచ్చే నెల 3వ‌ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని చెప్పారు.

రూ.300 అపరాధ రుసుముతో వచ్చే నెల 10వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.

పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

పరీక్షా తేదీల పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు.

వెబ్‌సైట్‌ www.osmania.ac.in