OU NEWS : ఉచిత సివిల్స్ కోచింగ్ అకాడమీ ప్రారంభం

హైదరాబాద్ (డిసెంబర్ – 14) : ఉస్మానియా యూనివ‌ర్సిటీ (OU) లో సివిల్స్ కోచింగ్ అకాడ‌మీ (CIVILS COACHING AKADEMI) ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ ఈరోజు ప్రారంభించారు. ఓయూ విద్యార్థుల సివిల్స్ లో ఉత్తమ ఫలితాలు సాదించడానికీ ఏర్పాటు చేశారు.

ఉస్మానియా వర్సిటీలో చదువుతున్న గ్రామీణ విద్యార్థులు సివిల్‌ సర్వీసు లాంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలన్నదే ఈ అకాడమీ ఏర్పాటుకు ముఖ్య ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు. ఈ అకాడమీలో ఒకేసారి వెయ్యిమంది అభ్యర్థులకు కోచింగ్‌ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. దాదాపు రూ.2 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ అకాడమీ విద్యార్థుల ప్రయోజనాలకు బాగా ఉపయోగపడుతుందని వీసీ రవీందర్ యాదవ్‌ తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మానికి ఐఏఎస్‌లు వాకాటి కరుణ‌, న‌వీన్ మిట్ట‌ల్, బుర్రా వెంక‌టేశం, ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ లింబాద్రి, ఓయూ వీసీ ర‌వీంద‌ర్, టీఎస్‌పీఎస్సీ మాజీ చైర్మ‌న్ ఘంటా చ‌క్ర‌పాణితో పాటు ప‌లువురు ప్రొఫెస‌ర్లు, విద్యార్థులు హాజ‌ర‌య్యారు.