ఓయూ దూరవిద్య ప్రవేశాలకు నోటిఫికేషన్

హైదరాబాద్ (ఆగస్టు – 02) : ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జి.రామిరెడ్డి దూరవిద్య కేంద్రంలో 2022 – 23 విద్యా సంవత్సరానికి వివిధ డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో మొదటి విడత ప్రవేశాలకు సోమవారం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఆగస్టు 3 నుంచి సెప్టెంబరు 16 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి రెండు పీజీ డిప్లొమా కోర్సులతో పాటు 10వ తరగతి అర్హతతో కొత్తగా 6 నెలల యోగా సర్టిఫికెట్ కోర్సును ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

వెబ్సైటు : http://oupgrrcde.com/Registration/Student/Default

Follow Us @