రెండు క్యాటగిరీల నుంచి ఓయూ పీహెచ్డీ ప్రవేశాలు

హైదరాబాద్ (ఆగస్టు 01) : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఫ్యాకల్టీలలో పీహెచ్డీ ప్రవేశాలను రెండు క్యాటగిరీలలో నిర్వహించనున్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు.

క్యాటగిరీ 1 కింద ప్రవేశాలకు ఏదైనా జాతీయస్థాయి ఫెలోషిప్ పొందాలని, వీరంతా ఈ నెల 6 లోపు సంబంధిత డీన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

క్యాటగిరీ 2 కింద ప్రవేశాలకు పీహెచ్డీ ప్రవేశ పరీక్ష పాస్ తో పాటు ఇంటర్వ్యూ నిర్వహిస్తామని, ఈ అభ్యర్థులు 18 నుంచి వచ్చే నెల 17 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

వెబ్సైట్ :: www.osmania.ac.in

www.ouadmissions.com

Follow Us @