OSCAR AWARDS – 2020

BIKKI NEWS : 2019 సంవత్సరానికిగాను ఆస్కార్ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సెన్సైస్ (Academy of Motion Picture Arts and Sciences-AMPAS) 2020, ఫిబ్రవరి 9న ప్రదానం చేసింది. అమెరికాలో లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 92వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో విజేతలు బహుమతులు అందుకున్నారు. 2019 ఏడాది జరిగిన 91వ ఆస్కార్ వేడుకలానే (oscar awards 2020 winners list in telugu) ఈసారి కూడా వ్యాఖ్యాత లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించారు.

దక్షిణ కొరియా చిత్రం ‘పారసైట్’ ఈ ఏడాది ఉత్తమ చిత్రం, ఉత్తమ విదేశీ చిత్రం సహా అత్యధికంగా నాలుగు అవార్డులు గెలుపొందింది. ఆ తర్వాతి స్థానంలో మూడు పురస్కారాలతో ‘1917’ నిలిచింది. ‘జోకర్’తో మెప్పించిన ఓక్విన్ ఫీనిక్స్ ఉత్తమ నటుడిగా తొలి ఆస్కార్ అందుకున్నారు. ‘జూడి’లో ప్రధాన పాత్రలో నటించిన రెనీ జెల్‌వెగర్ ఉత్తమ నటి పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ‘పారాసైట్’ చిత్రంతో బాంగ్ జూన్ హొ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు.

◆ ఉత్తమ డాక్యుమెంటరీగా అమెరికన్ ఫ్యాక్టరీ

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్లీ ఒబామా నిర్మాణ సంస్థలో రూపొందిన ‘అమెరికన్ ఫ్యాక్టరీ’ ఉత్తమ డాక్యుమెంటరీగా అవార్డు గెలుచుకుంది. వాళ్ల నిర్మాణ సంస్థ ‘హయ్యర్ గ్రౌండ్’ నిర్మించిన తొలి డాక్యుమెంటరీ ఇది.

◆ పారాసైట్..

బాంగ్ జూన్ హూ స్వీయదర్శకత్వంలో నిర్మించిన ‘పారసైట్’ చిత్రం ఈ ఏడాది నాలుగు ఆస్కార్లను గెలుచుకుంది. మొత్తం 6 విభాగాల్లో (ఉత్తమ చిత్రం, విదేశీ చిత్రం, దర్శకుడు, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ప్రొడక్షన్ డిజైన్, ఎడిటింగ్) నామినేషన్ దక్కించుకున్న ఈ చిత్రం 4 అవార్డులు (ఉత్తమ చిత్రం, దర్శకుడు, విదేశీ చిత్రం, స్క్రీన్‌ప్లే విభాగల్లో) కైవసం చేసుకుంది. ఉత్తమ చిత్రంగా ఆస్కార్ పురస్కారం అందుకున్న తొలి ఆంగ్లేతర చిత్రంగా నిలిచింది. సౌత్ కొరియాకి తొలి ఆస్కార్ తీసుకెళ్లిన ఘనత కూడా ఈ సినిమాదే. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన బాంగ్ ఉత్తమ దర్శకుడిగా, ఉత్తమ స్కీన్ర్‌ప్లే రచయితగా నిలిచారు. యాంగ్ లీ (2012, లైఫ్ ఆఫ్ పై) తర్వాత ఆసియా నుంచి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అందుకున్నది బాంగ్ మాత్రమే.

◆ 92వ ఆస్కార్ అవార్డులు-విజేతలు

* ఉత్తమ చిత్రం: పారసైట్

* ఉత్తమ నటుడు: ఓక్విన్ ఫీనిక్స్(జోకర్)

* ఉత్తమ నటి: రెనీజెల్ వెగర్ (జూడి)

* ఉత్తమ సహాయ నటుడు: బ్రాడ్ పిట్ (వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్)

* ఉత్తమ సహాయనటి: లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ)

* ఉత్తమ దర్శకుడు: బాంగ్ జూన్ హూ (పారసైట్)

* ఉత్తమ సంగీతం: హిల్డర్ (జోకర్)

* బెస్ట్‌మ్యూజిక్ ఒరిజినల్ సాంగ్: ఐయామ్ గాన్నా లవ్ మీ ఎగైన్ (రాకెట్ మ్యాన్)

* ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: పారసైట్

* మేకప్ అండ్ హెయిర్ స్టైలిస్ట్: బాంబ్ షెల్

* ఉత్తమ డాక్యుమెంటరీ: అమెరికన్ ఫ్యాక్టరీ

* బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: టైకా వైటిటి (జోజో ర్యాబిట్)

* బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: టాయ్‌స్టోరీ 4

* బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్: ది నైబర్స్ విండో

* ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: బాంగ్ జూన్ హూ (పారసైట్)

* ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్: లెర్నింగ్ టు స్క్వేర్‌బోర్డ్ ఇన్ ఏ వార్ జోన్ (ఇఫ్ యు ఆర్ ఏ గర్ల్)

* బెస్ట్ యానిమేటెడ్ షార్ట్: హెయిర్ లవ్

* బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ

* బెస్ట్ సౌండ్ మిక్సింగ్: 1917

* బెస్ట్ సినిమాటోగ్రఫీ: రోజర్ డెకిన్స్(1917)

* బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ

* బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్

* బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది నైబర్స్ విండో

* బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్: జాక్వెల్తెన్ డుర్రన్(లిటిల్ ఉమెన్)

* ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: 1917