హైదరాబాద్ (మే – 25) : తెలంగాణ ఉన్నత విద్య లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు పాలిటెక్నిక్ లెక్చరర్ ల క్రమబద్ధీకరణ ప్రక్రియలో విశేష కృషి చేసిన, వివిధ సమస్యల పరిష్కారంలో అత్యున్నత పనితీరు కనబరిచిన TGPLA – C సంఘాన్ని కొనసాగించాల వద్దా అనే అంశంపై మే – 25న అభిప్రాయ సేకరణ పోలింగ్ ద్వారా తెలుసుకోవడం జరిగింది.
ఈ పోలింగ్ లో 412 అధ్యాపకులకు గాను 405 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 319 మంది తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 297 (93.1% ) మంది TGPLA – C సంఘాన్ని యధావిధిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పోలింగ్ కు పోలింగ్ ఆఫీసర్లుగా శ్రీవాణి, మమత వ్యవహరించారు.
ఈ సందర్భంగా మిగిలిన 22 మందిని కూడా క్రమబద్ధీకరణ కొరకు ప్రయత్నం చేస్తామని సంఘ భాద్యులు తెలిపారు. ఓటింగ్ లో పాల్గొన్న అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు.