ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్ అడ్మిషన్లకు అవకాశం.

మధ్యలోనే చదువు చదువు ఆపేసిన విద్యార్థుల కోసం టెన్త్ మరియు ఇంటర్ చదవటానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) అడ్మిషన్లు కోరుతున్నది. ఇప్పటికే అడ్మిషన్ల గడువు ముగిసినప్పటికీ ఎవరైనా విద్యార్థులు అడ్మిషన్ చేసుకోకపోతే వారి కోసం ప్రత్యేక అడ్మిషన్ డ్రైవ్ ను 2 రోజుల పాటు మార్చి 26 & 27 తేదీలలో నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేశారు.

మార్చి 26, 27 తేదీల్లో దగ్గరలోని మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పిస్తూ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్ణయం తీసుకుంది. కావున ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ ను దూరవిద్య విధానంలో చేయాలనుకున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Follow Us@