హైదరాబాద్ (ఆగస్టు – 10) : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2023 – 24 విద్యాసంవత్సరానికి ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ (Open 10th and open inter admissions in toss) అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్ దరఖాస్తు గడువు నేటితో ముగుస్తుంది.
మధ్యలో చదువు ఆపేసిన మరియు వృత్తి వ్యాపారాలలో ఉన్న మరియు గృహిణి లకు ఉపయోగపడే విధంగా దూరవిద్య విధానంలో పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు రాయటానికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ తోడ్పడుతుంది.
సాధారణ పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ తో సమానమైన సర్టిఫికెట్లను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పొందవచ్చు. ఇవి అన్ని రకాల పరీక్షలకు సాధారణ సర్టిఫికెట్ల వల్లే ఉపయోగపడతాయి.