OPEN 10th, Inter : పరీక్షల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ (సెప్టెంబర్ 22) : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 2023 షెడ్యూల్ (open 10th and open inter supplementary exams 2023 schedule) ను సంచాలకులు పీవీ శ్రీహరి విడుదల చేశారు.

అక్టోబర్ 16 నుండి 26వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు ఎందుకు సంబంధించిన పరీక్ష ఫీజు స్వీకరణ ఇప్పటికే పూర్తయిన విషయం తెలిసిందే.

సప్లిమెంటరీ పరీక్షలను రోజుకు రెండు సెషన్ల చొప్పున నిర్వహించనున్నారు. ఉదయం 9.00 గంటల నుండి 12.00 గంటల వరకు, మధ్యాహ్నం 2.00 గంటల నుండి 5.00 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

అక్టోబర్ 30 నుండి నవంబర్ ఆరవ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. పూర్తి షెడ్యూల్ కోసం కింద ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి.

వెబ్సైట్ : https://www.telanganaopenschool.org/