హైదరాబాద్ (జనవరి – 30) :తెలంగాణ రాష్ట్రంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు – 2023 ఏప్రిల్ మరియు మే నెలలో నిర్వహించాలని తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన పరీక్ష ఫీజును అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా మీసేవ కేంద్రాల ద్వారా చెల్లించడానికి షెడ్యూల్ ను ఈరోజు విడుదల చేసింది.
ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫిబ్రవరి 01 నుండి ఫిబ్రవరి 10 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
25/- రూపాయల ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 11 నుండి ఫిబ్రవరి 16 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.
50/- రూపాయల ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 17 నుండి ఫిబ్రవరి 22 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు.