ఆన్లైన్ తరగతుల పై ఇంటర్ బోర్డు మార్గదర్శకాలు

కోవిడ్ -19 కారణంగా ఈ విద్యా సంవత్సరం నాలుగు నెలలు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు ల తరగతులను కోల్పోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, UGC మరియు CBSE లు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సూచనతో మరియు ఇంటర్మీడియట్ బోర్డు సెప్టెంబర్ మొదటి తేదీ నుంచి ఆన్లైన్ తరగతులను ప్రారంభించిన విషయం తెలిసిందే….

అయితే కోవిడ్19 కారణంగా కళాశాలలోకి కేవలం 50 శాతం సిబ్బంది ని మాత్రమే అనుమతిస్తున్న నేపథ్యంలో…

కళాశాలలకు వచ్చిన విద్యార్థులకు వచ్చిన 50 శాతం సిబ్బంది కళాశాల ప్రిన్సిపాల్ ఇచ్చిన టైమ్ టేబుల్ ప్రకారం తరగతులు నిర్వహించాలని, విద్యార్థుల హజరు తీసుకోవాలని, హజరు అయినా విద్యార్థుల పొటోలు మరుసటి రోజు ప్రిన్సిపాల్ కి అందించాలని తెలిపారు.

అలాగే ప్రతి వారం ప్రిన్సిపాల్ విద్యార్థుల హజరు మరియు పోటోలను సంబంధిత జిల్లా ఇంటర్ విద్యాధికారి కి సమర్పించాలని సూచించారు.

సంబంధిత జిల్లా విద్యాధికారులు 15 రోజులకోకసారి ఈ డేటాను క్రోడీకరించి ఆర్జేడీ ఆపీస్ లో సమర్పించాలని తెలిపారు.

Follow Us@