ఇంటర్ విద్యార్థులకు ఉచిత ఆన్లైన్ కెరీర్ గైడెన్స్.

తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ కళాశాలల్లో ఇంటర్‌ చదవుతున్న మూడు లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ఆన్‌లైన్‌ కెరీర్‌ గైడెన్స్‌ అందించేందుకు క్యాంపస్‌ క్రాప్‌, ఏపీఏసీ న్యూస్‌ నెట్‌వర్క్‌ సంస్థలు ముందుకు వచ్చాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

కెరీర్‌ గైడెన్స్‌ పోస్టర్‌ను మంత్రి తన కార్యాలయంలో సంస్థల ప్రతినిధులు ఎన్‌వీఎస్‌ మహేశ్‌, రశ్మీ బుసిరెడ్డి, సుధీర్‌ గౌతమ్‌, దినేష్‌ సమక్షంలో ఆవిష్కరించారు.

ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులకు వివిధ రంగాల్లో ఉండే అవకాశాల మీద స్పష్టమైన అవగాహన ఉచితంగా కల్పించాలనే ఈ ఉద్దేశ్యంతో క్యాంపస్‌ క్రాప్‌, ఏపీఏసీ న్యూస్‌ నెట్‌వర్క్‌ సంస్థలు ఈ కేరీర్ గైడెన్స్ కార్యక్రమం ప్రారంభించాయి.

పూర్తి వివరాల కోసం కింద ఇవ్వబడిన వెబ్సైట్ లను సందర్శించండి.

★ వెబ్సైట్ లు ::

CAMPUS CROP LINK

https://apacnewsnetwork.com/

Follow Us@