ఒక దేశం- ఒకే పరీక్ష

ఒక దేశం- ఒక పరీక్ష లక్ష్యంతో కేంద్రం వచ్చే విద్యాసంవత్సరం (2021-22) నుంచి దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 54 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ సీట్ల భర్తీకి సెంట్రల్‌ యూనివర్సిటీ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (CUCET) పేరుతో ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించడానికి కసరత్తు ప్రారంభమైందని ఫిక్కీ సదస్సులో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి అమిత్‌ ఖరే వెల్లడించారు.

తెలంగాణలో హెచ్‌సీయూ, ఇఫ్లూ, ఉర్దూ విశ్వవిద్యాలయాలూ వంటి కేంద్రీయ విశ్వవిద్యాలయాలూ ఉమ్మడి ప్రవేశపరీక్షలో భాగం కానున్నాయి.

జాతీయ పరీక్షల నిర్వహణ మండలి(NTA)కు పరీక్షల బాధ్యతను అప్పగించనున్నారు. ఈ పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో ఏటా రెండుసార్లు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Follow Us@