కేటీఆర్ జన్మదినం సందర్భంగా లక్ష డిక్షనరీలు పంపిణీ – మంత్రి సబితా ఇంద్రారెడ్డి

పురపాలక, ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు జన్మదినం సందర్భంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న లక్ష మంది విద్యార్థులకు డిక్షనరీలను అందజేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని తాను శనివారం నాడు లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.

ఇతర నియోజకవర్గాల్లో స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు విద్యార్థులకు డిక్షనరీలను అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు.

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో భౌతిక తరగతులు నిర్వహించడం లేనందున ఎంపిక చేసిన పాఠశాలల్లోనే శనివారం పంపిణీ చేస్తున్నామని, ఇతర పాఠశాలల విద్యార్థులకు సంబంధించి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేస్తామని మంత్రి తెలిపారు.