హైదరాబాద్ (మార్చి – 21) : రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పనిచేసే అన్ని రకాల ముస్లిం ఉద్యోగులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
సాధారణ పనివేళల కంటే గంట ముందుగా కార్యాలయాలు, పాఠశాలల నుంచి వారు వెళ్లడానికి అనుమతించింది. మార్చి 23 నుంచి ఎప్రిల్ 23 వరకూ ఈ వెసులుబాటు వర్తిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కార్యాలయాలు, బడుల్లో పనిచేసే రెగ్యులర్, ఒప్పంద, పొరుగు సేవలు, బోర్డులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుందని పేర్కొంటూ సీఎస్ ఎ. శాంతికుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మినహాయింపుకాలంలో ఒకవేళ అత్యవసర సేవలు అందించాల్సి వస్తే హాజరు కావాలని పేర్కొన్నారు.