BIKKI NEWS : ONDC FOR ONLINE FOOD DELIVERY and CAB SERVICES – కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ONDV (open network digital commerce) వేదికను ప్రారంభించింది. డీపీఐఐటీ(డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) నేతృత్వంలో వినియోగదారులకు నిర్దేశిత ధరలోనే ఫుడ్ డెలివరీలతో పాటు, క్యాబ్ లు, ఎలక్ట్రానిక్ వస్తువుల సేవలను లందించటం దీని ముఖ్య ఉద్దేశం.
ఏదైనా ప్రముఖ రెస్టారెంట్లో రూ.250కి దొరికే బిర్యానీ… ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే జీఎస్టీ, కన్వేయన్స్, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్, ప్యాకింగ్, డెలివరీ ఛార్జీలన్నీ కలిపి ఖర్చవుతోంది. రూ.300, దూరం పెరిగితే మరో రూ. 30 అదనంగా చెల్లించాలి.
మరోవైపు, అత్యవసరంగా ప్రైవేటు క్యాబ్లను బుక్ చేస్తే ‘పీక్, సర్జ్ అవర్స్’ పేరుతో రెట్టింపు బాదేస్తున్న దాఖలాలున్నాయి. నియంత్రణ, నిఘా కొరవడిన ఈ వ్యవస్థతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడు తున్న తరుణంలో దళారీ వ్యవస్థకు చెక్ పెడుతూ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రెస్టారెంట్ ధరలు, వినియోగదా రుడు ఉన్న దూరం ఆధారంగా నిర్దేశిత రుసుముతోనే ఆర్డర్లను చేర్చడం ఈ వేదిక ప్రత్యేకత.
ఉదాహరణకు నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ లో చికెన్ బిర్యానీ రూ.300 ఉంటే ఓఎన్ సీ లో ఆర్డర్ ఇవ్వడం ద్వారా నిర్దేశిత డెలివరీ ఛార్జీలు కలిపి రూ.320కి లభిస్తుందన్నమాట. ప్యాకేజింగ్, ఇంటర్నెట్ ఛార్జీలు అంటూ అదనపు బాదుడు ఉండదు.
హైదరాబాద్ లోనూ ఇటీవలే ఈ వేదిక సేవలను ప్రారంభించింది. ‘తెలంగాణ గిగ్ వర్కర్స్ అసోసియేషన్’కు చెందిన డెలివరీబాయ్ లు ఇందులో భాగస్వాములైనట్లు ఆ సంస్థ పేర్కొంది.
★ PAYTM తో నేరుగా ఆర్డర్ చేయవచ్చు
ఓఎన్డీసీ వేదికకు ప్రత్యేకమైన యాప్ ఏమీ లేదు.
యూపీఐ పేమెంట్ యాప్ ద్వారానే నేరుగా ఆర్డర్ ఇవ్వొచ్చు. ప్రస్తుతం పేటీఎం ద్వారా ఇది నగర వాసులకు అందుబాటులో ఉంది. హైదరాబాద్ కు చెందిన 25 వేల మంది డెలివరీబాయ్లు ఈ వేదికతో అనుసంధానమై పనిచేస్తున్నారు.