BIKKI NEWS (JULY 22) : OLD ZONAL SYSTEM APPLY FOR SOLVING 317 GO ISSUES – CABINET SUB COMMITTEE. జీవో 317పై మంత్రి దామోదర రాజ నర్సింహ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సమావేశమైంది. కమిటీ సభ్యులు, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. పాత జిల్లాల వారీగా ఉద్యోగుల సర్వీస్, ప్రమోషన్ అంశాలను పరిగణలోకి తీసుకొని 317 జీవోను పరిష్కరించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది.
OLD ZONAL SYSTEM APPLY FOR SOLVING 317 GO ISSUES – CABINET SUB COMMITTEE
సమావేశంలో తొమ్మిది ప్రభుత్వ శాఖలపై చర్చించారు. వివిధ శాఖల అధికారులు శాఖలపరంగా పూర్తి సమాచారం ఇవ్వనందున యుద్ధ ప్రాతిపదికన పూర్తి సమాచారం ఇవ్వాల్సిందిగా మంత్రి దామోదర రాజ నర్సింహ అధికారులను ఆదేశించారు. కమిటీ సమావేశంలో పలు అంశాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం జరిగిందని తెలిపారు.
త్వరలోనే మరొకసారి సమావేశమై పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు సమాచారం. తదనంతరం 317 జీవో బాధితులకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
సబ్ కమిటీ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు నవీన్ మిట్టల్, మహేశ్ కుమార్ ఎక్కా దత్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాస రావు, అడిషనల్ డీజీ షికా గోయల్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శరత్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ దేవసేన, ఇంటర్మీడియట్ బోర్డ్ డైరెక్టర్ శృతి ఓజా, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిని, సోషల్ వెల్ఫేర్ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఆయుష్ డైరెక్టర్ ప్రశాంతి, ప్రాథమిక విద్యా శాఖ డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డి, వైద్యారోగ్య శాఖ, జీఏడీ ఉన్నతాధికారులు వినయ్ కృష్ణా రెడ్డి, బూసని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.