హైదరాబాద్ (డిసెంబర్ 23) : ఆలస్యంగా విధుల్లో చేరిన టీచర్లకు పాఠశాల విద్యాశాఖ నోషనల్
బెనిఫిట్స్ వర్తింపజేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో వీరంతా సీపీఎస్ నుంచి పాత పింఛన్ పరిధిలోకి (old pension scheme for teachers) రానున్నారు. 2002 డీఎస్సీలో ఎంపికైన హిందీ భాషాపండితులు కొన్ని కారణాలతో 2008లో ఉద్యోగాల్లో చేరారు. వీరంతా 2002 నుంచి తమకు ప్రయోజనాలు కల్పించాలని కోర్టును ఆశ్రయించారు.
వీరికి 17-10-2002 నుంచి నోషనల్ బెనిఫిట్స్, ఆర్థికలాభం విధుల్లో చేరిన తేదీ నుంచి ఇవ్వాలని కోర్టు తీర్పును ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయా టీచర్లంతా ఓపీఎస్ పరిధిలోకి రానున్నారు.