హైదరాబాద్ (జూన్ – 04) : ఒడిశాలో జరిగిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై (odisha train Accident) సీబీఐ చేత విచారణ జరిపించాలని రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రమాదంలో ఉగ్రకోణం ఉందని పలువురు ఆరోపిస్తున్న నేపథ్యంలో సీబీఐతో విచారించనున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ఈ ప్రమాదంలో ఇప్పటికే దాదాపు 275 మందికి పైగా చనిపోయారు. వెయ్యికి మందికి పైగా గాయపడ్డారు.