OCTOBER 2023 IMPORTANT AWARDS WINNERS LIST

BIKKI NEWS : AWARDS OCTOBER 2023 పోటీ పరీక్షల నేపథ్యంలో అక్టోబర్ 2023 లో రాష్ట్రీయ‌, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ వ్యక్తులకు, సంస్థలకు అందజేసిన అవార్డుల జాబితా చూద్దాం.

1) టాటా అడ్వాన్స్డ్ సిస్టం నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : బి. అగర్వాల్

2) 2023వ సంవత్సరానికి సంబంధించి వైద్య నోబెల్ బహుమతిని అందుకున్న శాస్త్రవేత్తలు ఎవరు.?
జ : కటాలినా కరికో & డ్రూ వీస్‌మాన్

3) భౌతిక శాస్త్రంలో 2023 సంవత్సరానికి గానూ ఎవరికి నోబెల్ బహుమతి దక్కింది.?
జ : పియ‌రీ అగోస్టిని (Pierre Agostini), ఫెరెంక్ క్రౌజ్‌ (Ferenc Krausz) అన్నె హుయిల్ల‌ర్‌ (Anne L’Huillier)

4) నోబెల్ బహుమతి 2023 రసాయన శాస్త్రంలో గెలుచుకున్న శాస్త్రవేత్తలు ఎవరు.?
జ : మౌంజి బావెండి, లూయిస్‌ ఇ బ్రస్‌, అలెక్సీ ఐ ఎకిమోవ్‌

5) SASTRA రామానుజన్ ప్రైజ్ 2023 గెలుచుకున్న గణిత శాస్త్రవేత్త ఎవరు.?
జ : రుక్సియాంగ్ హాంగ్

6) 2023 సాహిత్య నోబెల్ బహుమతి ఎవరికి దక్కింది.?
జ : జాన్ పోస్సే (నార్వే)

7) కెనడా ఇండియా ఫౌండేషన్ అందించే “గ్లోబల్ ఇండియన్ అవార్డు 2023” ఎవరు ఎంపికయ్యారు.?
జ : సుధా మూర్తి

8) పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసిన వారికి అందించే “స్పినోజా ప్రైజ్ 2023” దక్కించుకున్న ప్రవాస భారతీయురాలు ఎవరు.?
జ : డాక్టర్ జోయీత గుప్తా

9) నోబెల్ శాంతి బహుమతి 2023ను ఎవరు గెలుచుకున్నారు.?
జ : నర్గేస్ మహ్మాదీ (ఇరాన్)

10) టాటా సాహిత్య లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఎవరికి దక్కింది.?
జ : సి ఎస్ లక్ష్మి

11) కేన్స్ ప్రపంచం చలనచిత్ర అవార్డులు 2023లో ఉత్తమ యాక్షన్ చిత్రంగా నిలిచిన భారతీయ సినిమా ఏది.?
జ : ది సర్వైవర్

12) జాతీయస్థాయి ఉత్తమ అంగన్వాడి టీచర్ గా ఎంపికైన తెలంగాణ టీచర్ ఎవరు.?
జ : వెంకటరమణ (సూర్యాపేట జిల్లా)

13) 2023 సంవత్సరానికి ఆర్దిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి దక్కింది.?
జ : క్లాడియా గోల్డిన్ (అమెరికా)

14) బుసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో నెట్ సిరీస్ విభాగంలో రెండు అవార్డులు దక్కించుకున్న వెబ్ సిరీస్ ఏది.?
జ : స్కూప్

15) బాలసాహిత్య పురష్కారం 2023 ఎవరు అందుకున్నారు.
జ : యన్.దిలీప్

16) ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ సెప్టెంబర్ 2023 గా నిలిచిన పురుష క్రికెటర్ ఎవరు.?
జ : శుభమన్ గిల్

17) ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ సెప్టెంబర్ 2023 గా నిలిచిన మహిళ క్రికెటర్ ఎవరు.?
జ : చమారి ఆటపట్టు

18) రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు 2023 కు ఎవరిని ఎంపిక చేశారు.?
జ : సంజీవ రెడ్డి

19) సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం 2023 ఎవరికి బహుకరించారు.?
జ : విమలక్క

20) ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా 2023 అవార్డు ఎవరికి దక్కింది.?
జ : చిట్టూరి జగపతిరావు

21) సత్యజీత్ రే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు 2023ను ఏ నటుడుకి కేంద్రం ప్రకటించింది.?
జ : మైకెల్ డగ్లస్ (హాలీవుడ్)

22) ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ కలర్ అవార్డు అందుకున్న బెటాలియన్ ఏది.?
జ : నాగా రేంజ్మెంట్ యొక్క మూడవ బెటాలియన్

23) ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ అవార్డు 2022 అందుకున్నది ఎవరు.?
జ : శివశంకరి

24) ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పర్యాటక సంస్థ (UNWTO) చేత ఉత్తమ పర్యాటక గ్రామ అవార్డు అందుకున్న భారతీయ గ్రామం ఏది.?
జ : దోర్దో (గుజరాత్)

25) ప్రతిష్టాత్మక మానవ హక్కుల పురస్కారం “సఖరోవ్ పురస్కారం 2023” కు ఎవరికి ప్రకటించారు.?
జ : మాసా అమీని (ఇరాన్)

26) పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఏ గ్రామం ఉత్తమ పర్యాటక గ్రామ అవార్డును సొంతం చేసుకుంది.?
జ : నవాన్‌పిండ్ సర్‌ధరన్

27) మిస్ ఓషన్ వరల్డ్ 2023 కిరీటం దక్కించుకున్న సుందరి ఎవరు.?
జ : అవంతి ష్రాఫ్

28) హార్వార్డ్ లా స్కూల్ నుంచి గ్లోబల్ లీడర్షిప్ అవార్డు పొందినది ఎవరు.?
జ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వై చంద్రచూడ్

29) దుర్గా భారత్ సమ్మాన్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు.?
జ : పండిట్ అజయ్ చక్రవర్తి

30) అమెరికా దేశపు అత్యున్నత సైన్స్ అవార్డులు ‘నేషనల్ మెడల్ ఫర్ సైన్స్’ గెలుచుకున్న ఇండో అమెరికన్ శాస్త్రవేత్తలు ఎవరు.?
జ : అశోక్ గాడ్గిల్ & సుబ్ర సురేష్

31) చర్మ క్యాన్సర్ తో పోరాడే సబ్బు తయారుచేసి 3M యంగ్ సైంటిస్ట్ చాలెంజ్ విజేతగా నిలిచిన బాలుడు ఎవరు.?
జ : హెమన్ బెకిలే

32) బ్రాడ్ బ్రాండ్ సేవలలో మల్టిపుల్ ఇన్, మల్టిపుల్ అవుట్ సాంకేతికతను అభివృద్ధి చేసిన ఏ భారతీయుడికి ఫారడే అవార్డు దక్కింది.?
జ : ఆరోగ్య స్వామి పాల్ రాజ్

33) మదర్ థెరిసా మెమోరియల్ అవార్డు 2023 ఎవరు ఎంపికయ్యారు.?
జ : నర్గీస్ మొహమ్మద్

34) మిసెస్ ఆసియా ప్రపంచ సుందరి – 2023, మిసెస్ సింగపూర్ – 2023, మిసెస్ కైండ్ నెస్ – 2023, ఆసియా పసిఫిక్ క్వీన్ ఆఫ్ సబ్స్టెన్స్ – 2023 టైటిల్స్ గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళ ఎవరు.?
జ : చిలకల విజయదుర్గ

35) గోల్డెన్ పీకాక్ అవార్డు అందుకున్న మహారత్న సంస్థ ఏది.?
జ : REC లిమిటెడ్