పదో తరగతి అర్హతతో 10వేల స్టైఫండ్ తో నర్సరీ ఏర్పాటుకు సర్టిఫికెట్ కోర్సు

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థలో తొలిసారిగా సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించనున్నారు. ఎంటర్ ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా నిరుద్యోగులకు నర్సరీ ఏర్పాటుకుపై శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణాకాలంలో ప్రతినెలా రూ.10వేల స్టైఫండ్ ఇవ్వనున్నారు. నర్సరీని ఏర్పాటు చేసేందుకు ఫెలోషిప్ కింద రూ.50 వేలు అందిస్తారు.

నర్సరీల పెంపకం వర్మీకంపోస్టు తయారీ, తేనెటీగల పెంపకంపై ఆరునెలల పాటు శిక్షణ ఇస్తారు. మూడు నెలలు తరగతులు, మరో మూడు నెలలు క్షేత్ర స్థాయిలో ప్రత్యక్ష శిక్షణ ఉంటుంది.

పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా www.fcritr.in లో లేదా నేరుగా దరఖాస్తు చేయవచ్చు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ మమత తెలిపారు. మరిన్ని వివరాలకు 9885226957, 8074350866 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Follow Us @