US OPEN 2023 : పదోసారి ఫైనల్ చేరిన జకోవిచ్

US OPEN 2023 (సెప్టెంబర్ – 09) : ప్రపంచంలో నెంబర్ వన్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ (novac djacovic reached usopen 2023 final) అమెరికా ఆటగాడు బెనస షెల్టన్ పై సెమీఫైనల్ లో వరుస సెట్లలో 6-3, 6-2, 7-6 (4) తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్ కి చేరడం నోవా జకోవిచ్ కు ఇది పదవ సారి కావడం విశేషం. 2011, 2015, 2017 లలో యుఎస్ ఓపెన్ గెలుచుకున్న నోవాక్ జకోవిచ్ 4 వ టైటిల్ పై కన్నేశాడు. మొత్తంగా ఇప్పటికే 22 గ్రాండ్ స్లామ్ లు దక్కించుకున్న నోవాక్ జకోవిచ్ 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ పై కన్నేశాడు.

సోమవారం నాడు జరిగే ఫైనల్ నోవాక్ జకోవిచ్ కు 36 గ్రాండ్ ఫైనల్ కావడం విశేషం.

ఈ ఏడాది జరిగిన నాలుగు గ్రాండ్ స్లామ్స్ ఆస్ట్రేలియా, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ ఫైనల్స్ కు చేరడం విశేషం.

అల్కరాజ్, మెద్వదేవ్ మద్య జరిగిన సెమీఫైనల్ విజేతతో నోవాక్ తలబడనున్నాడు.