తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల వేతనాలు నుండి ఆదాయ పన్ను లో భాగంగా టీడిఎస్ మినహాయించి వేతనాలు చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ డ్రాయింగ్ ఆఫీసర్లకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ విషయం మీద కాంట్రాక్టు అధ్యాపకుల సంఘాలు కమిషనర్ టిడిఎస్ కి మినహయించవద్దని విన్నవించగా కమిషనర్ సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ విషయం టాక్స్ నిపుణులతో చర్చిస్తున్నామని దీనికి సంబంధించి ఐటీ శాఖకు ఆప్పిల్ కు వెళ్లే ప్రయత్నం చేస్తున్నామని, ఈ విషయం మీద నిర్ణయం తీసుకునే వరకు కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు వేతనాలను యధాతధంగా చెల్లించాలని డ్రాయింగ్ ఆఫీసర్లకు ఇంటర్మీడియట్ కమిషనర్ సూచించారు.
ఆదాయపన్ను శాఖ నుండి సమాధానం వచ్చిన తర్వాత వేతనాల నుండి టీడీఎస్ మినహాయింపు విషయం మీద స్పష్టత ఇస్తామని కమీషనర్ తెలిపారు.
Follow Us @