నాన్ టీచింగ్ స్టాప్ కు జూనియర్ లెక్చరర్ లుగా పదోన్నతి.

తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాన్ టీచింగ్ స్టాప్ కు జూనియర్ లెక్చరర్ గా పదోన్నతుల కోసం జూనియర్ కాలేజీలు మరియు డిగ్రీ కాలేజీలు మరియు ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్లలో పని చేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ నుండి అప్లికేషన్స్ ను స్వీకరించాలని ఇంటర్ విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్ వరంగల్, మరియు జిల్లా ఇంటర్ విద్యాధికారులను ఇంటర్మీడియట్ కమిషనర్ ఉమర్ జలీల్ ఆదేశించారు.

ఇంటర్మీడియట్ వ్యవస్థలో జూనియర్ లెక్చరర్లుగా నాన్ టీచింగ్ స్టాఫ్ కు ఉన్న 10 శాతం కోటాలో భాగంగా ఈ పదోన్నతులను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

కావునా ఐదవ, ఆరవ మరియు హైదరాబాద్ సిటీ క్యాడర్ లలో ఖాళీగా ఉన్న పోస్టులలో 10% కోటాను నాన్ టీచింగ్ స్టాప్ కు జూనియర్ లెక్చరర్ లుగా పదోన్నతులు కల్పించి భర్తీ చేయనున్నారు.

Follow Us @