వోకేషనల్ కోర్సుల్లో 319 నాన్ శాంక్షన్ పోస్టుల శాంక్షన్ కు కృషి – సీహెచ్ కనక చంద్రం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఒకేషనల్ కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల పోస్టులలో దాదాపు 319 పోస్టులు శాంక్షన్ కాలేదని కావునా వెంటనే ఆ పోస్టులను శాంక్షన్ చేయాలని ఒకేషనల్ కాంట్రాక్టు అధ్యాపకులు ప్రభుత్వాన్ని కోరారు.

క్రమబద్దీకరణ కోసం ఇచ్చిన జీవో నెంబర్ 16 ప్రకారం శాంక్షన్ పోస్టులలో పని చేసే కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీస్ మాత్రమే క్రమబద్ధీకరణకు సాధ్యమవుతుందని వారు తెలిపారు. వారి నియామకాలు జరిగినపుడు శాంక్షన్ పోస్టుల లోనే నియమించారని ఈ సందర్భంగా వారు తెలిపారు.

గతంలో నూతన జూనియర్ కళాశాలలో దాదాపు 600 పైచిలుకు పోస్టులను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి శాంక్షన్ చేయించానని, ఇప్పుడు ఒకేషనల్ కాంట్రాక్టు అధ్యాపకులు పని చేస్తున్న 319 నాన్ శాంక్షన్ పోస్టుల అంశం ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్లాలని త్వరలోనే ఆ పోస్టులను శాంక్షన్ చేపించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్. కనక చంద్రం ఒక ప్రకటనలో తెలిపారు.

Follow Us @