క్రమబద్ధీకరణ కానీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ విషయం ప్రభుత్వం దృష్టికి – ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

BIKKI NEWS (SEP. 29) : non regularized contract lecturers issue. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో క్రమబద్ధీకరణ కాకుండా మిగిలిపోయిన కాంట్రాక్ట్ అధ్యాపకుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లవలసిందిగా.. ఈరోజు ఖమ్మం పట్టణముకు విచ్చేసిన ఖమ్మం నల్లగొండ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారికి వినతి పత్రం సమర్పించినట్లు తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ – 475 ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ మరియు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు శ్రీ గుమ్మడి మల్లయ్య తెలిపారు.

non regularized contract lecturers issue.

ఈరోజు ఖమ్మం పట్టణానికి విచ్చేసిన అలుగుబెల్లి నర్సిరెడ్డి గారిని కలిసి వివిధ కారణాలవల్ల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న సుమారు 444 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న సుమారు 689 మంది డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ జరగలేదని, వీరి తప్పు లేనప్పటికీ అధికారులు వివిధ సాంకేతిక కారణాలతో నెపంతో, గత 20 సంవత్సరాల పైగా పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరణ చేయకపోవడం చాలా విచారకరమని, వారి కుటుంబాలు చాలా మానసికంగా, ఆర్థికంగా ఆందోళన గురవుతున్నారని, వీరు చదువు చెప్పిన విద్యార్థులు కాంట్రాక్టు లెక్చరర్ గా జాయిన్ అయి వారు క్రంబద్దీకరణ జరగడం జరిగిందని, కానీ వీరు తప్పు లేనప్పటికీ సరైన సమయంలో ప్రభుత్వ అధికారుల సమన్వయం లోపం వలన ఈ విధంగా జరిగిందని ఎమ్మెల్సీ
ఏ. నర్సిరెడ్డి గారి దృష్టికి తీసుకువస్తూ… వీరి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత త్వరగా క్రమబద్దీకరణ జరిగేటట్లుగా చూడవలసిందిగా వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి స్పందిస్తూ… ఈ సమస్యను త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతూ, మన ప్రతినిధి బృందాన్ని తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం TGJLA 475 రాష్ట్ర మరియు ఖమ్మం జిల్లా కమిటీ & మహబూబాబాద్ జిల్లా కమిటీ తరఫున, ఖమ్మం జిల్లా TGEJAC నాయకులు మరియు TGOs& TNGO మరియు టీఎస్ యుటిఎఫ్ నాయకులు కష్టాల సత్యనారాయణ, కొణిదల శ్రీనివాస్, నాగమల్లేశ్వరరావు, పారుపల్లి నాగేశ్వరావు, తదితరులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో TGJLA_475 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & TGEJAC రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షుడు, కృష్ణార్జునరావ్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు గుమ్మడి మల్లయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పోలూరి మురళీకృష్ణ ,జిల్లా కోశాధికారి కె భాస్కర్ ,రాష్ట్ర కౌన్సిలర్స్ కే శ్రీకాంత్ , రాంబాబు , మహబూబాద్ జిల్లా రాష్ట్ర కౌన్సిలర్ సత్యనారాయణ ,జిల్లా నాయకులు బి. నాగేశ్వరరావు, మహబూబాద్ జిల్లా మోడల్ స్కూల్ జిల్లా నాయకులు గండి ఉపేందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు