చరిత్ర సబ్జెక్టు విద్యార్థి సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుంది – పి. వెంకటేశ్వర్లు

  • ఇంటర్ విద్యా నోడల్ అధికారి, ములుగు

ములుగు : (జూలై – 22) : ములుగు జిల్లా నోడల్ కార్యాలయం యందు శుక్రవారం రోజున చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ ఇంటర్ హెచ్.ఇ.సి. కోర్సులో అడ్మిషన్స్ పెంచుటకు రూపొందించిన వాల్ పోస్టరును జిల్లా నోడల్ అధికారి పి. వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలమాన పరిస్థితుల్లో విద్యాబోధనలో పోటీతత్వం పెరగడంతో విద్య స్వరూపం మారిపోతోంది. నేడు తల్లిదండ్రులు, విద్యార్థులు ఇంటర్ చదువుకు గీటురాయిగా పరీక్షలు, మార్కులు, ర్యాంకులు అనే భావనలో ఉన్నారు. దింతో విద్యార్థులలో మానవ, నైతిక విలువలు కొరవడి దేశ చరిత్ర సంస్కృతి పట్ల సరైన అవగాహన లేకుండా పోతుందన్నారు. కావున ఇంటర్ విద్యాబోధనలో విద్యార్థి సమగ్ర అభివృద్ధి చరిత్ర సబ్జెక్టు భోధన ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అలాగే చరిత్ర అధ్యాపకులు చరిత్ర సబ్జెక్టు పట్ల నేటి విద్యార్థులకు అవగాహన కల్పించడంలో ముందుండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బి. వెంకన్న, చరిత్ర అధ్యాపకులు డా. ఎం.డీ. రహీం మరియు ఇతర అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Follow Us @