జగిత్యాల (ఆగస్టు – 06) : కొడిమ్యాల మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు శనివారం రోజున చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ ఇంటర్ హెచ్. ఇ. సి. కోర్సులో అడ్మిషన్స్ పెంచుటకు రూపొందించిన వాల్ పోస్టరును జిల్లా ఇంటర్ నోడల్ అధికారి బి. నారాయణ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ లో హెచ్.ఈ.సి. కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులు భవిష్యత్తులో మంచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే అవకాశం ఉందన్నారు. చరిత్ర అధ్యయనం ద్వారా విద్య, పర్యాటక మరియు ప్రయివేట్ రంగాలలో అనేక ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలలో చరిత్ర విద్యార్థులదే పైచేయి ఉంటుందని పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ కళాశాల్లో మాత్రమే హెచ్. ఈ. సి. కోర్సు ఉంటుందని, కావున విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి అని సూచించారు. అలాగే ఈ సంవత్సరం ఇంటర్ వార్షిక ఫలితాలలో హెచ్.ఈ.సి. గ్రూపులో జగిత్యాల జిల్లా విద్యార్థి అప్రా తహర్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం. సంజీవ్, జిల్లా జిజెఎల్ఏ అధ్యక్షులు కె. వేణు, చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డా. పి.తిరుపతి, ఎం. భాస్కర్, కె. తిరుపతిరెడ్డి, బి. రవీందర్, ఎం. ప్రవీణ్ తదితరులు
పాల్గొన్నారు.