BIKKI NEWS. : NOBEL 2021 AWARDS WINNERS COMPLETE LIST
◆ nobel prize 2021 winners list
రంగం | విజేతలు | ప్రత్యేకత |
వైద్య శాస్త్రం | * డేవిడ్ జూలియస్, * అర్డెమ్ పటాపౌటియన్. | స్పర్శ, మానసిక ఒత్తిడిలు కలిగించే నాడీ కణాలు పై పరిశోధన |
రసాయన శాస్త్రం | * బెంజమిన్ లిస్ట్, *మెక్‌మిలన్. | అణువులను నిర్మించడానికి ఎసిమెట్రిక్ ఆర్గానో కాటలిసిస్” అనే కొత్త మార్గాన్ని అభివృద్ధి చేశారు |
భౌతిక శాస్త్రం | * స్యుకురో మనాబె, * క్లాస్ హాసెల్‌మాన్, * గియోర్గియో పారిసి. | క్రమరహిత సంక్లిష్ట పదార్థాల నమూనా అబివృద్ది, CO2కారణంగా భూమి వేడెక్కుట పై పరిశోధనలు |
ఆర్థికశాస్త్రం | * డేవిడ్ కార్డ్, * జోష్వా డి.యాంగ్రెస్ట్, * గైడో డబ్ల్యు.ఇంబెన్స్. | లేబర్ మార్కెట్ పై పరిశోధనలు |
సాహిత్యం | * అబ్దుల్ రజాక్ గుర్నా. | వలసవాదుల కష్టాలు పై రచనలు |
శాంతి | * మరియా రెసా, * దిమిత్రి మురటోవ్. | ప్రజాస్వామ్యానికి మూలమైన భావ ప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణ కోసం చేసిన కృషికి |
1) ఫిజియాలజీ లేదా వైద్య శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ 2021 ని డేవిడ్ జూలియస్ మరియు ఆర్డెమ్ పటపౌటియన్
★ డేవిడ్ జూలియస్ – మిరప మిరియాలు నుండి వచ్చే కాప్‌సైసిన్ అనే పదార్థం కలిగించే మంటను గుర్తించే మన చర్మం చివర ఉండే నాడీ కణాలను గుర్తించాడు.
★ ఆర్డెమ్ పటాపౌటియన్ – చర్మం మరియు అంతర్గత అవయువాలలో ఒత్తిడికి ప్రతిస్పందించే నాడీ కణాలను గుర్తించాడు.
2) భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి 2021కి గాను స్యుకురో మనాబె, క్లాస్ హాసెల్‌మాన్, గియోర్గియో పారిసిలను ఫిజిక్స్ నోబెల్ ఇస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.
★ స్యుకురో మనాబె :: జపాన్‌లోని షింగు నగరంలో 1931లో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో నుంచి 1957లో ఆయన పీహెచ్‌డీ పొందారు. అమెరికాలోని ప్రిన్స్‌స్టన్ యూనివర్సిటీలో సీనియర్ మెటిరాలాజిస్ట్‌గా చేస్తున్నారు
★ క్లాస్ హాసెల్‌మాన్ :: జర్మనీలోని హాంబర్గ్‌లో 1931లో పుట్టారు. జర్మనీలోని గొట్టిన్‌జెన్ వర్సిటీ నుంచి 1957లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. హాంబర్గ్‌లో ఉన్న మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెటిరాలజీలో ప్రొఫెసర్‌గా చేస్తున్నారు.
★ గియోర్గియో పారిసి :: ఇటలీ దేశంలోని రోమ్‌లో 1948లో జన్మించారు. రోమ్‌లో ఉన్న సెపింజా యూనివర్సిటీ నుంచి 1970లో ఆయన పీహెచ్‌డీ పూర్తి చేశారు. సెపింజా వర్సిటీలోనే ప్రొఫెసర్‌గా చేశారు.
3) రసాయన శాస్త్ర నోబెల్ 2021 గాను జర్మనీకి చెందిన బెంజమిన్ లిస్ట్, అమెరికాకు చెందిన డేవిడ్ డబ్ల్యూసీ మెక్‌మిలన్‌లకు వరించింది. “అణువులను నిర్మించడానికి ఎసిమెట్రిక్ ఆర్గానో కాటలిసిస్” అనే కొత్త మార్గాన్ని అభివృద్ధి చేసినందుకుగాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.
◆ బెంజమిన్ లిస్ట్ :: 1968లో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జన్మించారు. 1997లో గోతె యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు.
◆ మెక్‌మిలన్ :: 1968లో యూకేలోని బెల్‌షిల్‌లో జన్మించారు. 1996లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పీహెచ్డీ చేశారు. ప్రస్తుతం ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
______________________________________________________
4) ఆర్థిక శాస్త్రం లో నోబెల్ బహుమతి – 2021 గాను ముగ్గురు ని వరించింది.
★ డేవిడ్ కార్డ్ :: 1956లో కెనడాలో జన్మించారు. అమెరికాలోని ప్రిస్టన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ (1983) చేశారు. ప్రస్తుతం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్.
★ జోష్వా డి.యాంగ్రెస్ట్ :: అమెరికాలోని కొలంబస్ లో 1960లో జన్మించారు. ప్రిస్టన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ (1989). ప్రస్తుతం మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆర్ధికశాస్త్ర ప్రొఫెసర్,
★ గైడో డబ్ల్యు.ఇంబెన్స్ :: 1968లో నెదర్లాండ్ లో జన్మించారు. అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్ డీ (1991) పూర్తి చేశారు. ప్రస్తుతం స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్ధికశాస్త్ర ప్రొఫెసర్.
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
5) సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి – 2021 గాను టాంజానియా కు చెందిన అబ్దుల్ రజాక్ గుర్నా ని వరించింది. వలసవాదుల కష్టాలపై అతని రచనలకు ఈ గౌరవం దక్కింది.
రచనలు ::
మెమొరీ ఆఫ్ డిపార్చర్(1987)
పిలిగ్రిమ్స్ వే(1988)
డాటీ(1990)
పారడైజ్(1994)
అడ్మైరింగ్ సైలెన్స్(1996)
బై ది సీ(2001)
డిజర్షన్(2005)
ది లాస్ట్ గిఫ్ట్(2011)
గ్రేవల్ హార్ట్(2017)
ఆఫ్టర్ లైవ్స్(2020)
6) ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారం 2021 గానూ ప్రజాస్వామ్యానికి మూలమైన భావ ప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణ కోసం చేసిన కృషికి చేసిన ఫిలిప్పీన్స్, రష్యా జర్నలిస్టులు మరియా రెసా, దిమిత్రి మురాటోవ్‌లకు దక్కింది.
★ మరియా రెసా :: (రాప్లర్ పత్రిక)
తమ దేశం ఫిలిప్పీన్స్ లో పెరుగుతున్న అధికార దుర్వినియోగం, హింసను తన కలంతో ప్రపంచానికి తెలియజేశారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కోసం 2012లో ఆమె ‘రాప్లర్’ పేరుతో ఓ డిజిటల్ మీడియా కంపెనీని స్థాపించారు. ఓ జర్నలిస్టుగా, రాప్లర్ సీఈవోగా రెసా..
★ దిమిత్రి మురటోవ్ :: (నోవాజా గెజిటా పత్రిక)రష్యాలో కొన్ని దశాబ్ధాలుగా భావ స్వేచ్ఛ కోసం మురటోవ్ పోరాటం చేశారు. రోజురోజుకూ సవాల్‌గా మారుతున్న పరిస్థితుల్లో ఆయన మేటి జర్నలిస్టు పాత్రను పోషించారు. 1993లో నోవాజా గెజిటా అనే పత్రికను స్థాపించారు.