BIKKI NEWS (OCT – 04) : NOBEL PRIZE 2023 IN PHYSICS ను ముగ్గురు భౌతిక శాస్త్రవేత్తలకు ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. పియరీ అగోస్టిని (Pierre Agostini), ఫెరెంక్ క్రౌజ్ (Ferenc Krausz) అన్నీ హుయిల్లర్ (Anne L’Huillier) లకు ఈ యేటి ఫిజిక్స్ నోబెల్ బహుమతి దక్కింది. కాంతికి చెందిన ఆటోసెకండ్ పల్స్‌లను పసికట్టే పద్ధతులను అభివృద్ధి చేసినందుకు ఆ ముగ్గురినీ నోబెల్ వరించింది. ఎలక్ట్రాన్ డైనమిక్స్ స్టడీలో ఈ పద్ధతులు కీలకం అయినట్లు రాయల్ స్వీడిష్ కమిటీ వెల్లడించింది.
పరమాణువులు, అణువుల్లో ఎలక్ట్రాన్ల కదలికలు చాలా వేగంగా ఉంటాయని, వాటిని ఆటోసెకండ్స్‌లో కొలుస్తారు. ఆటోసెకండ్ అంటే ఒక సెకను అని, అది ఈ విశ్వం వయసుకు ఓ సెకండ్‌తో సమానమని పేర్కొన్నారు. ఆటోసెకండ్ లైటు ద్వారా ఎలక్ట్రాన్ల కదలికలను స్టడీ చేయవచ్చు.
అయితే ఈ టెక్నాలజీ క్రమేణా అభివృద్ధి చెందుతున్నట్లు అకాడమీ తన ప్రకటనలో తెలిపింది. పరమాణువుల్లో ఎలక్ట్రాన్ల లోకాన్ని పరిచయం చేసిన శాస్త్రవేత్తలకు ఈ సంవత్సరం నోబెల్ ఫిజిక్స్ అవార్డు దక్కుతుందని కమిటీ వెల్లడించింది.
పియరీ అగోస్టిని (Pierre Agostini)
అమెరికాకు చెందిన పియరీ ప్రసీ ఓహియో రాష్ట్రంలో ప్రొపెసర్ గా పని చేస్తున్నారు. 1968 లో PhD పట్టా పొందారు.
ఫెరెంక్ క్రౌజ్ (Ferenc Krausz)
హంగేరి దేశానికి చెందిన ఫెరెంక్ ప్రస్తుతం మాక్స్ ఫ్లాంక్ క్వాంటమ్ ఇనిస్టిట్యూట్ కు డైరెక్టర్ గా ఉన్నారు.
అన్ని హుయిల్లర్ (Anne L’Huillier)
ప్రాన్స్ చెందిన అన్ని 1958 లో జన్మించింది. ప్రస్తుతం లూండ్ యూనివర్సిటీ – స్వీడన్ లో ప్రొఫెసర్ గా పని చేస్తోంది.