“నో స్కూల్ బ్యాగ్ డే” విధానం

10 రోజులు విద్యార్థులు బడిసంచి లేకుండా పాఠశాలలకు వచ్చేలా “నో స్కూల్‌ బ్యాగ్‌ డే’’ అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

బడిసంచి బరువూ పిల్లల బరువులో 10 శాతం మించొద్దని పేర్కొంది. స్కూల్‌ బ్యాగ్‌ పాలసీ-2020ని తీసుకొచ్చిన కేంద్ర విద్యాశాఖ దాని అమలుకు చర్యలు తీసుకుని నివేదిక పంపాలని అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులకు తాజాగా లేఖలు రాసింది. ‘నో స్కూల్‌ బ్యాగ్‌’ రోజుల్లో విద్యార్థులకు ఆటలు, పాటల పోటీలు, క్విజ్‌, లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది.

2018 లో మద్రాస్‌ హైకోర్టు ఓ కేసులో బడిసంచి బరువు తగ్గించేందుకు ఓ విధానం రూపొందించాలని తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిపుణులతో కమిటీని నియమించింది.

ఈ కమిటీ బడిసంచి బరువుపై దేశవ్యాప్తంగా పాఠశాలలో సర్వే నిర్వహించారు. ఈ సర్వే నివేదిక ప్రకారం నో స్కూల్‌ బ్యాగ్‌’ డే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.

Follow Us@