కేంద్ర విద్యా సంస్థలలో రిజర్వేషన్లు ఎత్తివేతకు ప్రతిపాదనలు

ప్రతిష్టాత్మక కేంద్ర విద్యాసంస్థల్లో బోధనా ఉద్యోగ నియామకాలలో రిజర్వేషన్లు ఎత్తివేయాలని కేంద్ర విద్యా సంస్థలలో రిజర్వేషన్లపై వి . రావుగోపాల్ రావు నేతృత్వంలో నియమించిన కమిటీ కేంద్ర విద్యా శాఖకు జూలైలో నివేదిక సమర్పించింది. తాజాగా ఈ నివేదిక బయటకు వచ్చింది.

సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్సిటిట్యూషన్స్ – 2019 చట్టం ప్రకారం కేంద్ర విద్యాసంస్థలు అయినా ఐఐటి, ఐఐఎం, నిట్ మరియు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో బోధన సిబ్బంది నియామకాల్లో రిజర్వేషన్లను తీసివేయాలని కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో బోధనా సిబ్బంది నియామకాల్లో రిజర్వేషన్ల అమలుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

అయితే రిజర్వేషన్ లకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేకమైన కోట పద్ధతిని అవలంబించాలని ఈ కమిటీ తన 5 పేజీల నివేదికలో సూచించింది.

Follow Us@