కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యల పరిష్కారం పై వెనకడుగు వేసేది లేదు – ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.

తెలంగాణ రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులు/ లెక్చరర్స్ రెగ్యులరైజేషన్ మరియు బదిలీల సమస్యలు పరిష్కరించడంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలియజేశారు.

ఈరోజు ఖమ్మం లో కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్(475) ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం మరియు మహబూబాద్ జిల్లాల కమిటీల ఆధ్వర్యంలో డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఖమ్మంలో కలిసి బదిలీల గురించి మరియు ఈరోజు కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్దీకరణకు అనుకూలంగా వచ్చిన కోర్టు తీర్పును, ఇతర సమస్యలు వివరించడం జరిగింది.

దీనిపై సానుకూలంగా స్పందించిన డాక్టర్ పల్లా మాట్లాడుతూ కాంట్రాక్ట్స్ లెక్చరర్ ల బదిలీ విషయంలో ఆరో తారీఖున హైదరాబాద్ లో కలిసి మాట్లాడదామని తెలిపారు.

అదేవిధంగా ఈరోజు కాంట్రాక్టు ఉద్యోగులు మరియు లెక్చరర్ ల క్రమబద్ధీకరణపై హైకోర్టులో ఇచ్చిన తీర్పుని పరిశీలిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ తో మాట్లాడి కేసులు త్వరగా పరిష్కరం అయ్యేటట్లు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులు / లెక్చరర్ల క్రమబద్ధీకరణకు శాయశక్తులా కృషి చేస్తామని తెలియజేశారు.

అదేవిధంగా పీఆర్సీ అమలు చేసే విషయంలో మరియు H.R.A. & D.A. లు కూడా కాంట్రాక్ట్ లెక్చరర్ వర్తింపచేయాలని డాక్టర్ పల్లాని కోరగా అన్ని సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కాసాల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం మరియు మహబూబాద్ జిల్లాల నాయకులు కొండ వినోద్ బాబు, పోలూరి మురళి కృష్ణ, కొల్లూరు భాస్కర్, పద్మావతి, T. జాను, తోట నాగేశ్వర్రావు, రాష్ట్ర నాయకులు సత్యనారాయణ, కృష్ణార్జున రావు ,మల్లయ్య, నరేష్ రాజా రహీమ్, లక్ష్మణ్, కల్లూరి శ్రీనివాస్, మురళీకృష్ణ, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us@