హైదరాబాద్ (మే – 20) : నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్(NMMS) కింద డిసెంబర్ – 2022 లో పరీక్ష రాసిన వారిలో తెలంగాణ రాష్ట్రం నుంచి 2,716 మంది ఎంపికయ్యారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే నిర్వహించే ఈ పరీక్ష గత డిసెంబరు 18వ తేదీన జరిగింది. దానికి 31,807 మంది హాజరయ్యారు. ఎంపికైన వారికి 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యేవరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఉపకార వేతనం అందుతుందని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు.