భారతీయుడికి పాక్ అత్యున్నత పౌర పురస్కారం

BIKKI NEWS (నవంబర్ – 24) : ముంబయి కేంద్రంగా పనిచేసే దావూదీ బొహ్ర ఇస్లామిక్ సంస్థ అధిపతి సైద్నా మఫద్దాల్ సైఫుద్దీను పాకిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారమైన నిషాన్ -ఇ- పాకిస్థాన్ లభించింది. (Nishan e pakistan Prize To saidhna mafadhal Sifuddin)

పాకిస్థాన్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ బుధవారం ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ఈ పురస్కారం అందుకోనున్న నాలుగో భారతీయుడు సైఫుద్దీన్.

40 దేశాల్లో విస్తరించి ఉన్న దావూదీ బొహ్ర ఇస్లామిక్ సమాజానికి సైఫుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్నారు. భారత్ లోని ముంబయికి చెందిన సైపుద్దీన్ అనేక సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు నేతృత్వం వహించారు. ఈజిప్టులోని అల్- హకీం- మసీదు సహా అనేక పురాతన కట్టడాలను పునరుద్ధరించారు. ఆయన ప్రస్తుతం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలకు ఛాన్స్‌లర్ గా వ్యవహరిస్తున్నారు.

సైఫుద్దీన్ కు ముందు భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, ప్రముఖ నటుడు దిలీప్ కుమార్, కశ్మీరీ వేర్పాటు వాద నేత అలీ గిలానీలకు పాకిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారాలు దక్కాయి.