జంషెడ్పూర్ (మార్చి – 07) : నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎంసీఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (నిమ్ సెట్)-2023 ప్రకటన వెలువడింది. ఈ ఏడాది నిమ్ సెట్ ను నిట్, జంషెడ్పూర్ నిర్వహిస్తోంది. నిమ్ సెట్ 9 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)ల్లో ప్రవేశం లభిస్తుంది.
◆ సీట్ల వివరాలు: అగర్తలా- 30, అలహాబాద్ – 116, భోపాల్ 115, జంషెడ్పూర్ – 115, కురుక్షేత్ర – 96 (వీటిలో 32 సెల్ఫ్ ఫైనాన్స్), రాయ్ పూర్ – 110, సూరత్ – 58, తిరుచురాపల్లి 115, వరంగల్ – 58.
◆ మొత్తం సీట్ల సంఖ్య: 813.
◆ అర్హతలు : మ్యాథ్స్ లేదా స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా బీఎస్సీ, బీసీఏ, బీఐటీ, బీ వొక్(కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేషన్స్)ల్లో ఏదైనా కోర్సు చదివుండాలి లేదా ఏ బ్రాంచీలోనైనా బీటెక్/ బీఈ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ కోర్సు చదివినప్పటికీ కనీసం 60 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 55 శాతం) తప్పనిసరి. చివరి సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారూ అర్హులే.
◆ సీట్ల కేటాయింపు : మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఉమ్మడి కౌన్సెలింగ్ ద్వారా సీట్లను కేటాయిస్తారు.
◆ తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్.
◆ దరఖాస్తు ఫీజు : ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1250. మిగిలిన అందరికీ రూ.2500
◆ దరఖాస్తు గడువు : ఏప్రిల్ 10 వరకు.
◆ పరీక్ష తేదీ : జూన్ 11.
◆ ఫలితాల ప్రకటన : జూన్ 16.