Nikaht Zareen : జాతీయ ఛాంప్ గా నిఖత్ జరీన్

బోఫాల్ (డిసెంబర్ – 26) : బోఫాల్ వేదికగా జరుగుతున్న 6వ ఎలైట్ నేషనల్ బాధ్యత బాక్సింగ్ ఛాంపియన్స్ షిప్ 2022 పోటీలలో 48 -50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ ఫైనల్స్‌లో రైల్వేస్‌కు చెందిన అనామికను 4-1 తేడాతో ఓడించి జాతీయ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నది. ఈ ఏడాది కామన్‌వెల్త్‌ గేమ్స్‌ లో గోల్డ్ మెడల్, వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిళ్లను గెలుచుకుని నిఖత్‌ మంచి ఫామ్‌లో ఉన్నది.

70-75 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గహన్ అరుంధతి చౌదరి ని ఓడించి గోల్డ్ మెడల్ సాదించింది.