BIKKI NEWS (AUG. 30) : NHAI JOB NOTIFICATION 2024. జాతీయ రహదారుల సంస్థలో ఉద్యోగావకాశాలు కల్పి స్తున్నట్టు ఆ సంస్థ సీనియర్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కేటగిరీల్లో 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు.
NHAI JOB NOTIFICATION 2024
ఖాళీల వివరాలు
- జనరల్ మేనేజర్,
- డిప్యూటీ జనరల్ మేనేజర్,
- మేనేజర్
అర్హతలు : బీటెక్ సివిల్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు
వయోపరిమితి : NHAI నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 56 ఏళ్లకు మించకూడదు.
వేతన వివరాలు :
- జనరల్ మేనేజర్ పోస్టులకు ₹1,23,100 నుంచి ₹2,15,900,
- డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు ₹78,800 నుంచి ₹2,09,200,
- మేనేజర్ పోస్టుకు ₹67,700 నుంచి ₹2,08,700 వరకు వేతనం ఉంటుందని వెల్లడించారు.
దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 23 – 2024 వరకు
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు
ప్రత్యక్ష పద్దతిలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారంను కింద ఇవ్వబడిన చిరునామా కు అక్టోబర్ 22 వరకు పంపవచ్చు.
చిరునామా : డీజీఎం హెచ్ఎర్ అడ్మిన్, 3, నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా, ప్లాట్ నెంబర్ జీ.5, 6, సెక్టార్ 10, ద్వారక, కొత్త ఢిల్లీ-110075