Apprenticeship – న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్ లో 300 ఖాళీలు

BIKKI NEWS (NOV. 15) : NFC 300 Apprenticeship Recruitment.. హైదరాబాద్ లోని న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్ లో ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా 300 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు.

NFC 300 Apprenticeship Recruitment

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : నవంబర్ – 25- 2024

ఖాళీల ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రిషియన్, మెషినిస్ట్, అటెండెంట్ ఆపరేటర్/ కెమికల్ ప్లాంట్ ఆపరేటర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్స్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్), మోటార్ మెకానిక్స్ (వెహికల్), డ్రాఫ్ట్స్ మ్యాన్ (మెకానికల్), సీఓపీఏ, డీజిల్ మెకానిక్, కార్పెంటర్, ప్లంబర్, వెల్డర్, స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్).

అర్హతలు : పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి : దరఖాస్తు ముగింపు తేదీ నాటికి 18 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు. (జనరల్ అభ్యర్థులకు 25 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 30 ఏళ్లు మించకూడదు.)

స్టైపెండ్ వివరాలు : నెలకు రూ.7,700/- నుంచి రూ. 8,050/-

ఎంపిక విధానం: పదో తరగతి/ ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎలక్ట్రిషియన్, వెల్డర్ ట్రేడులకు ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించి ఎంపిక చేస్తారు.

రిజిస్ట్రేషన్ లింక్ : Apply Here

వెబ్సైట్ : https://www.nfc.gov.in/recruitment.html

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు