తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో నూతన జోనల్ విధానాన్ని అమలు పరచడానికి ఇంటర్మీడియట్ కమీషనర్ ఉమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఇకనుండి రెగ్యులర్ నియామకాలు మరియు పదోన్నతులు వంటి వాటిని నూతన జోనల్ విధానంలోనే అమలు చేయడానికి ఇంటర్మీడియట్ కమీషనరేట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
రాష్ట్రపతి ఆమోదం మేరకు రెండు మల్టీ జోన్లు, ఆరు జోన్లు గా తెలంగాణ రాష్ట్రాన్ని విభజించిన విషయం తెలిసిందే.