కొత్త స్థానికత తో ఉద్యోగాల పునర్విభజన

  • ప్రభుత్వశాఖల్లో క్యాడర్‌ రీ ఆర్గనైజేషన్‌ పూర్తి
  • జిల్లా, జోనల్‌, మల్టీజోనల్‌ పోస్టులుగా విభజన
  • 85 జీవోలు జారీ.. కొత్త జిల్లాలకు పోస్టులు

◆ మల్టీ జోనల్‌ పోస్టులు ::

డిప్యూటీ కలెక్టర్‌/ ఆర్డీవో, అసిస్టెంట్‌ సెక్రటరీ, సూపరింటెండెంట్‌, తాసిల్దార్‌, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే, సీఐ, డీఎస్పీ, కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌, డిప్యూటీ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-1, 2, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, హెల్త్‌ ఇన్‌స్ట్రక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్‌ పంచాయతీ ఆఫీసర్‌, ఎంపీడీవో, మండల పంచాయతీ అధికారి, అగ్రికల్చర్‌ అధికారి, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌-1, డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-2,3 తదితర అధికారులు.

◆ సొంత జిల్లాకు వెళ్లే అవకాశం ::

పోస్టుల పునర్వ్యవస్థీకరణతో వేరే జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సొంత జిల్లాలకు వెళ్లే అవకాశం లభించనున్నది. ఉదాహరణకు నల్లగొండ జిల్లాలో పనిచేస్తున్న యాదాద్రి జిల్లాకు చెందిన ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సొంత జిల్లాకు వెళ్లేందుకు ఆప్షన్‌ పెట్టుకుంటాడు. అతడికి సంబంధించిన డిపార్ట్‌మెంట్‌ పోస్టు సొంత జిల్లాలో ఖాళీ ఉంటే వెంటనే ఆ జిల్లాకు బదిలీ అవుతాడు. ఖాళీ లేకపోతే ప్రస్తుతం ఉన్నచోటైనా ఉండటానికి, మరో జిల్లాకు ఆప్షన్‌ ఇచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది.

కొత్త జిల్లాలు, కొత్త జోన్ల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల విభజనకు ముందడుగుపడింది. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు పోస్టులను పునర్వ్యవస్థీకరిస్తూ రాష్ట్రప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలు, జోనల్‌, మల్టీజోనల్‌ పోస్టులుగా ఉద్యోగాలను పునర్వ్యవస్థీకరిస్తూ సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) శుక్రవారం 85 జీవోలు జారీచేసింది. టీచర్‌పోస్టులు మినహా అన్నిశాఖల పోస్టులను వర్గీకరించారు. కొత్త జిల్లాల ప్రకారం క్యాడర్‌ రీ ఆర్గనైజేషన్‌ జరగాల్సి ఉండగా, పలు కారణాలతో ఇంతకాలం చేపట్టలేదు. జిల్లాల్లో ఉద్యోగులంతా ఆర్డర్‌ టు సర్వ్‌ విధానంలో పనిచేస్తున్నారు. ఇటీవలే నూతన జోనల్‌ విధానానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయటంతో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకొని ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. దీనిపై లోతుగా కసరత్తు చేసిన జీఏడీ ఆదేశాలు జారీచేసింది.

◆ ఇప్పుడే ఎందుకంటే ::

రాష్ట్రంలో కొత్త జోన్లు, మల్టీ జోన్లను ఏర్పాటు చేస్తూ 2018 ఆగస్టులో ప్రభుత్వం జీవో 124ను జారీచేసింది. ఈ జీవోలోని పేరా 36 క్లాజు 1 ప్రకారం జీవో వెలువరించిన 36 నెలల్లో పోస్టుల పునర్వ్యవస్థీకరణ పూర్తిచేయాలి. ఈ నెలతో ఆ గడువు దాటుతుండటంతో ప్రభుత్వం క్యాడర్‌ రీ ఆర్గనైజేషన్‌ను పూర్తిచేసి జీవోలు జారీచేసింది. ఈ మొత్తం ప్రక్రియను నాలుగు దశల్లో చేపడతారని అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం కసరత్తు పూర్తయ్యేందుకు రెండుమూడు నెలలు పడుతుందని వెల్లడించాయి.

◆ సొంత జిల్లాకు వెళ్లే అవకాశం ::

పోస్టుల పునర్వ్యవస్థీకరణతో వేరే జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సొంత జిల్లాలకు వెళ్లే అవకాశం లభించనున్నది. ఉదాహరణకు నల్లగొండ జిల్లాలో పనిచేస్తున్న యాదాద్రి జిల్లాకు చెందిన ఒక జూనియర్‌ అసిస్టెంటు పునర్వ్యవస్థీకరణలో భాగంగా తన సొంత జిల్లాకు వెళ్లేందుకు ఆప్షన్‌ పెట్టుకుంటాడు. అతడికి సంబంధించిన డిపార్ట్‌మెంటు పోస్టు తన సొంత జిల్లాలో ఖాళీ ఉంటే వెంటనే ఆ జిల్లాకు బదిలీ అవుతాడు. ఖాళీ లేకపోతే ప్రస్తుతం ఉన్నచోటైనా ఉండటానికి, మరో జిల్లాకు ఆప్షన్‌ ఇచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది. ఏదైనా జిల్లాలో ఒక విభాగంలో ఖాళీలు ఎక్కువగా ఉన్నప్పుడు అవసరానికి మించి పోస్టులు ఉన్న జిల్లా నుంచి జూనియర్‌ మోస్ట్‌ ఉద్యోగులను అక్కడికి బదిలీచేసే అవకాశం ఉంటుంది.

◆ మొదటి దశ ::

తాజా జీవోల ప్రకారం కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లవారీగా పోస్టులను అన్వయించుకొంటారు. అన్ని ప్రభుత్వ విభాగాలు తమ పరిధిలోని పోస్టులను కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లవారీగా వర్గీకరిస్తాయి. దీంతో ఏ విభాగంలో ఏ పోస్టు ఏ క్యాడర్‌లో ఉందన్నదానిపై స్పష్టత వస్తుంది.

◆ రెండో దశ ::

జిల్లాలవారీగా క్యాడర్‌ స్ట్రెంత్‌పై స్పష్టత వస్తుంది. జిల్లాలో విభాగాలవారీగా మొత్తం పోస్టులెన్ని అన్నది కూడా తేలుతుంది. పోస్టులు తక్కువగా ఉన్న చిన్న జిల్లాలకు కొత్తగా కేటాయిస్తారు.

◆ మూడో దశ ::

రెండో దశలో లెక్కతేలిన పోస్టులను బట్టి కొత్త జిల్లాలు, జోన్లవారీగా ఉద్యోగులను సర్దుబాటు చేస్తారు. ఉద్యోగుల బదిలీలు చేపడతారు. ఇందుకు ఉద్యోగులందరికి ఆప్షన్లు ఇస్తారు. ఆప్షన్లు ఎంచుకున్న ప్రకారం ఆయా జిల్లాలకు ఉద్యోగులను సర్దుబాటు చేస్తారు. ఏదైనా జిల్లాల్లో ఎక్కువ, తక్కువ పోస్టులుంటే రెండో ప్రాధాన్యతగా ఆప్షన్లు ఇస్తారు. ఇలా ఉద్యోగులను జిల్లాలవారీగా విభజిస్తారు.

◆ నాలుగో దశ ::

జిల్లాకు కేటాయించిన పోస్టులెన్ని? ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు? కొత్తగా భర్తీచేయాల్సిన ఖాళీలెన్ని? అనే అంశంపై స్పష్టత వస్తుంది. దీంతో ఖాళీల భర్తీకి మార్గం సుగమం అవుతుంది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం 50వేలకు పైగా ఉద్యోగాలను భర్తీచేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా పునర్వవస్తీకరణ నేపథ్యంలో జిల్లా పోస్టులు కొత్త జిల్లాల్లోని వారికి, జోనల్‌ పోస్టులు ఆయా జోన్‌ పరిధిలోని నాలుగైదు జిల్లాల వారికి, మల్టీ జోనల్‌ పోస్టులు ఆయా మల్టీజోన్‌లోని వారికి దక్కనున్నాయి.

◆ తాజా క్యాడర్‌ స్ట్రెంత్‌ ప్రకారం ::

● జిల్లా క్యాడర్‌ ::

టైపిస్టు, జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ స్టెనో, డ్రైవర్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌, రెనో ఆపరేటర్‌, జమేదార్‌, చైన్‌మెన్‌, డఫేదార్‌, కుక్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌, శానిటరీ వర్కర్‌, స్వీపర్‌, వాచ్‌మెన్‌, ఫోర్‌మెన్‌, కార్పెంటర్‌, మేస్త్రీ, గార్డెనర్‌, మిలిమాలన్‌, చౌకీదార్‌, ప్రింటింగ్‌ టెక్నీషియన్‌, కానిస్టేబుల్‌, జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-4 తదితర పోస్టులు.

● జోనల్‌ క్యాడర్‌ ::

నాయిబ్‌ తాసీల్దార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, ఎంఆర్‌ఐ, ఏఆర్‌ఐ, సీనియర్‌ స్టెనోగ్రాఫర్‌, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే, సూపరింటెండెంట్‌, నాన్‌టెక్నికల్‌ పర్సనల్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, హెడ్‌ కానిస్టేబుల్‌, ఏఎస్‌ఐ, ఎస్‌ఐ, అసిస్టెంట్‌ కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌, సీనియర్‌ డ్రైవర్‌, అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-1,2,3, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌-2, తదితర పోస్టులు.

● మల్టీ జోనల్‌ పోస్టులు ::

డిప్యూటీ కలెక్టర్‌/ ఆర్డీవో, అసిస్టెంట్‌ సెక్రటరీ, సూపరింటెండెంట్‌, తాసీల్దార్‌, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే, సీఐ, డీఎస్పీ, కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌, డిప్యూటీ కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఇంజినీర్‌, డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-1, 2, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, హెల్త్‌ ఇన్‌స్ట్రక్టర్‌, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్‌ పంచాయతీ ఆఫీసర్‌, ఎంపీడీవో, మండల పంచాయతీ అధికారి, అగ్రికల్చర్‌ అధికారి, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌-1, డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-2,3 తదితర అధికారులు.

◆ ఉద్యోగల సంఘాల హర్షం ::

రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరిస్తూ వివిధ విభాగాల్లోని పోస్టులను జోన్లు, మల్టిజోన్ల వారీగా ఖరారు చేయడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 95 శాతం ఉద్యోగాలకు స్థానిక రిజర్వేషన్‌ లభించేలా సీఎం కేసీఆర్‌ కృషి చేశారని తెలంగాణ గజిటెడ్‌ అధికారుల సంఘం (టీజీవో) అధ్యక్షురాలు మమత అన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై టీజీవో నేతలు ఏ సత్యనారాయణ, ఎస్‌ సహదేవ్‌, రవీందర్‌కుమార్‌, ఎంబీ కృష్ణ యాదవ్‌, జీ వెంకటేశ్వర్లు, టీఎన్జీవో నేతలు మామిల్ల రాజేందర్‌,రాయకంటి ప్రతాప్‌ సంతోషం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌కుకృతజ్ఞతలు తెలిపారు.

CREDITS : NT NEWS

Follow Us @