BIKKI NEWS (FEB. 29) : తమ ప్రభుత్వం ఇచ్చిన హామీమేరకు రాష్ట్రంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ళు మరియు రేషన్ కార్డులు త్వరలోనే మంజూరు చేస్తామని, మహిళలకు రూ.2,500 అందిస్తామని (new white ration cards and Indiramma houses schemes ) రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో వందల సంఖ్యల్లోనే రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చారని, తాము అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. వెంకటగిరిలో రూ.2.65 కోట్లతో నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియం, తిరుమలాయపాలెం మండలం మహ్మదాపురంలో రూ.5 కోట్లతో గిరిజన మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి పొంగులేటి బుధవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా అమలుచేసి తీరతామన్నారు. ధరణిలో వచ్చిన 2.45 లక్షల దరఖాస్తులను పరిష్కరిస్తామని చెప్పారు.