New Mandals : కొత్తగా రెండు మండలాలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్ (జూన్ – 28) : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు మండలాలు ఏర్పాటు కానున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ‘కొత్తపల్లి గోరి‘ మండలం, రంగారెడ్డి జిల్లాలో ‘ఇర్విన్‌‘ మండల ఏర్పాటుకు రెవెన్యూశాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ బుధవారం తుది నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ప్రస్తుతం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 11 మండలాలు, 241 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్త మండలం ఏర్పాటుతో మండలాల సంఖ్య 12కు చేరనున్నది.

ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో 27 మండలాలున్నాయి. అలాగే 12 మున్సిపాలిటీలు, మూడు నగరపాలక సంస్థలున్నాయి. ఇర్విన్‌ మండల ఏర్పాటుతో మండలాల సంఖ్య 28కి చేరనున్నది.