BIKKI NEWS (MARCH 12) : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఈరోజు సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంద. పేద ప్రజలకు తెల్ల రేషన్ కార్డులు జారీ చేయడానికి (NEW RATION CARDS IN TELANGANA APPROVES CABINATE) క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
అర్హులైన పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన రేషన్ కార్డుల కోసం భారీగా ప్రజలు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన రేషన్ కార్డుల జారీకి క్యాబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకుంది.
నూతన రేషన్ కార్డుల జారీకి సంబంధించి వివిధ విధానాలను త్వరలో రూపొందించి, దరఖాస్తులు స్వీకరించడానికి చర్యలు తీసుకోనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారెంటీలకు కూడా రేషన్ కార్డు ప్రామాణికమనే విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనూతన రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.