Ration cards : 2 03 లక్షల నూతన రేషన్ కార్డులు మంజూరు

BIKKI NEWS (JUNE 11) : new ration cards distribution soon.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 2.03 లక్షల మందికి నూతన రేషన్ కార్డులను మంజూరు చేసింది. దీంతో ళరాష్ట్రంలో రేషన్‌ లబ్ధిదారుల సంఖ్య మూడు కోట్లు దాటింది. మే నెలాఖరు నాటికి లబ్ధిదారుల సంఖ్య 3,11,28,921కి చేరుకుంది.

new ration cards distribution soon.

కొత్తగా మంజూరైన వారికి స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా రేషన్‌కార్డుల మంజూరు పత్రాలు అందించాలని రాష్ట్ర సర్కారు యోచిస్తున్నట్టు సమాచారం. ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించనున్నట్లు తెలిసింది.

జనవరి 26వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల మంజూరు ప్రక్రియ మొదలైంది. ఇదే సమయంలో పాత కార్డుల్లో కొత్త పేర్ల నమోదుకూ అవకాశం కల్పించాలని పౌరసరఫరాల శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా మీ-సేవతోపాటు కులగణన ద్వారానూ దరఖాస్తులు అందాయి. ఆయా దరఖాస్తులను పరిశీలిస్తూ విడతల వారీగా..జనవరి 26, ఫిబ్రవరి 28, ఏప్రిల్‌ 24, మే నెల 23 తేదీల్లో నాలుగు విడతల్లో కొత్తగా 2,03,156 కార్డులు మంజూరుచేశారు. అలాగే తొమ్మిది విడతల్లో పాత కార్డుల్లో కొత్త సభ్యులుగా 29,81,356 మంది పేర్లను నమోదుచేశారు.

రేషన్‌ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ అని, ఇంకా పరిశీలించాల్సిన దరఖాస్తులు పెద్దసంఖ్యలోనే ఉన్నాయని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు